నాహోరు సంతతి
20ఆ సంగతులన్నీ జరిగిన తరువాత తన సోదరుడైన నాహోరుకు మిల్కా ద్వారా పిల్లలు కలిగారు అనే వార్త అబ్రాహాముకు చేరింది. 21ఆ పిల్లలు ఎవరంటే, పెద్ద కొడుకు ఊజు, అతడి తమ్ముడు బూజు, అరాము తండ్రి కెమూయేలు, 22కెసెదు, హజో, పిల్దాషు, జిద్లాపు, బెతూయేలు. ఈ బెతూయేలు రిబ్కాకు తండ్రి.
23అబ్రాహాము సోదరుడైన నాహోరుకు ఆ ఎనిమిదిమందీ మిల్కా ద్వారా కలిగారు. 24అతని ఉంపుడుకత్తె రెయూమా ద్వారా అతనికి తెబహు, గహము, తహషు, మయకా పుట్టారు.


