యేసు క్రీస్తు వంశావళి

1ఇది అబ్రాహాము సంతానమైన దావీదు సంతానం నుండి వచ్చిన క్రీస్తు యేసు వంశావళి:

2అబ్రాహాము కుమారుడు ఇస్సాకు,

ఇస్సాకు కుమారుడు యాకోబు,

యాకోబు కుమారులు యూదా అతని సహోదరులు.

3యూదా కుమారులైన పెరెసు, జెరహు; వీరి తల్లి తామారు.

పెరెసు కుమారుడు హెస్రోను,

హెస్రోను కుమారుడు అరాము.

4అరాము కుమారుడు అమ్మీనాదాబు,

అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను,

నయస్సోను కుమారుడు శల్మాను.

5శల్మాను కుమారుడు బోయజు; అతని తల్లి రాహాబు,

బోయజు కుమారుడు ఓబేదు; అతని తల్లి రూతు,

ఓబేదు కుమారుడు యెష్షయి.

6రాజైన దావీదు యెష్షయి కుమారుడు.

దావీదు కుమారుడు సొలొమోను; అతని తల్లి అంతకుముందు ఊరియాకు భార్య.

7సొలొమోను కుమారుడు రెహబాము,

రెహబాము కుమారుడు అబీయా,

అబీయా కుమారుడు ఆసా.

8ఆసా కుమారుడు యెహోషాపాతు,

యెహోషాపాతు కుమారుడు యెహోరాము,

యెహోరాము కుమారుడు ఉజ్జియా.

9ఉజ్జియా కుమారుడు యోతాము,

యోతాము కుమారుడు ఆహాజు,

ఆహాజు కుమారుడు హిజ్కియా.

10హిజ్కియా కుమారుడు మనష్షే,

మనష్షే కుమారుడు ఆమోను,

ఆమోను కుమారుడు యోషీయా.

11యోషీయా కుమారులెవరనగా యెకొన్యా అతని తమ్ముళ్ళు. యూదులు బబులోను పట్టణానికి బందీలుగా కొనిపోబడిన కాలంలో వీరు పుట్టారు.

12బబులోనుకు కొనిపోబడిన తర్వాత పుట్టినవారు వీరే:

యెకొన్యా కుమారుడు షయల్తీయేలు,

షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు.

13జెరుబ్బాబెలు కుమారుడు అబీహూదు,

అబీహూదు కుమారుడు ఎల్యాకీము,

ఎల్యాకీము కుమారుడు అజోరు.

14అజోరు కుమారుడు సాదోకు,

సాదోకు కుమారుడు ఆకీము,

ఆకీము కుమారుడు ఎలీహూదు.

15ఎలీహూదు కుమారుడు ఎలియాజరు,

ఎలియాజరు కుమారుడు మత్తాను,

మత్తాను కుమారుడు యాకోబు.

16యాకోబు కుమారుడైన యోసేపు మరియకు భర్త. ఆమె యేసు అని పిలువబడిన క్రీస్తుకు తల్లి.

17ఈ విధంగా అబ్రాహాము నుండి దావీదు వరకు పద్నాలుగు తరాలు, దావీదు నుండి బబులోను చెరకు కొనిపోబడిన కాలం వరకు పద్నాలుగు తరాలు, చెరకు కొనిపోబడినప్పటి నుండి క్రీస్తు వరకు పద్నాలుగు తరాలు.