దేవుని కీర్తించుట
33ఆహా, దేవుని బుద్ధి జ్ఞానాల సమృద్ధి ఎంతో లోతైనది!
ఆయన తీర్పులు ఎంతో నిగూఢమైనవి,
ఆయన మార్గాలు మన ఊహకు అందనివి!
34“ప్రభువు మనస్సును తెలుసుకున్న వారెవరు?
ఆయనకు ఆలోచన చెప్పగలవారెవరు?”
35“ముందుగానే దేవునికి ఇచ్చి
ఆయన నుండి తిరిగి పొందగలవారు ఎవరు?”
36ఆయన నుండి ఆయన ద్వారా ఆయన కోసమే సమస్తం ఉన్నాయి
కాబట్టి ఆయనకే మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్.


